Devineni Uma: నారా లోకేశ్ ను వచ్చే నెలలో జైలుకు పంపే ప్రయత్నాలు జరుగుతున్నాయి: దేవినేని ఉమ

Devineni Uma talks to media after releasing from jail
  • జైలు నుంచి విడుదలైన దేవినేని ఉమ
  • ప్రెస్ మీట్ ఏర్పాటు
  • కక్ష సాధిస్తున్నారని వ్యాఖ్యలు
  • అందుకే టీడీపీ నేతల అరెస్టులన్న ఉమ  
జైలు నుంచి విడుదలైన మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలను జైల్లో పెట్టడం ద్వారా ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని అన్నారు. ఇప్పటికే పలువురు నేతలను జైల్లో ఉంచారని తెలిపారు. వందల కోట్ల ఆస్తులను, దేవాలయాలను, విద్యాసంస్థలను ప్రజలకు అందించిన కుటుంబం నుంచి వచ్చిన అశోక్ గజపతిరాజు వంటి పెద్ద మనిషి పేరును కూడా ముద్దాయిలా ఎఫ్ఐఆర్ లో చేర్చారని విమర్శించారు.

అంతేకాకుండా, నారా లోకేశ్ ను వచ్చే నెల్లో జైలుకు పంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఉమ సంచలన ఆరోపణలు చేశారు. జగన్ గతంలో జైల్లో ఉన్నప్పుడు ఓ నెంబరు ఇచ్చారని, ఇప్పుడదే తరహాలో టీడీపీ నేతలకు కూడా జైల్లో నెంబరు ఇవ్వాలన్న కక్ష పూరిత ఉద్దేశంతోనే అరెస్టులకు పాల్పడుతున్నట్టుందని వ్యంగ్యం ప్రదర్శించారు.
Devineni Uma
Press Meet
Nara Lokesh
Jail
TDP
YSRCP
Andhra Pradesh

More Telugu News