రవి దహియా రెజ్లింగ్ పోరును జైల్లో వీక్షించి భావోద్వేగాలకు గురైన సుశీల్ కుమార్

05-08-2021 Thu 20:12
  • టోక్యో ఒలింపిక్స్ లో రవి కుమార్ కు రజతం
  • జైల్లో బుల్లితెరపై మ్యాచ్ చూసిన సుశీల్ కుమార్
  • రవికుమార్ ఓటమితో తీవ్ర నిరాశ
  • గతంలో ఒకే స్టేడియంలో శిక్షణ పొందిన సుశీల్, రవి
 Sushil Kumar gets emotional while watching Ravi Kumar Dahiya bout

హత్య కేసులో ఢిల్లీ తీహార్ జైల్లో ఉన్న సీనియర్ రెజ్లర్ సుశీల్ కుమార్ తీవ్ర భావోద్వేగాలకు గురయ్యాడు. అందుకు బలమైన కారణమే ఉంది. టోక్యో ఒలింపిక్స్ లో రవికుమార్ దహియా మ్యాచ్ ను సుశీల్ కుమార్ జైల్లో బుల్లితెరపై వీక్షించాడు. రవికుమార్ ఓటమిని సుశీల్ కుమార్ తట్టుకోలేకపోయాడని జైలు అధికారులు వెల్లడించారు.

సుశీల్ కుమార్ కూడా ఒలింపిక్ రెజ్లరే. 2012 ఒలింపిక్స్ లో పతకం సాధించాడు. సుశీల్, రవికుమార్ ఇద్దరూ ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలోనే శిక్షణ పొందారు. కాగా, యువ రెజ్లర్ సాగర్ ధంకఢ్ హత్య కేసులో సుశీల్ కుమార్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. పరారీలో ఉండగా సుశీల్ కుమార్ ను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.