ఎన్నో ఏళ్ల తర్వాత నా మెడలో ఐడీ కార్డు పడింది: జూనియర్ ఎన్టీఆర్

05-08-2021 Thu 19:54
  • ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్న ఎన్టీఆర్
  • ఉక్రెయిన్ లో షూటింగ్ జరుపుకుంటున్న చిత్రం
  • యూనిట్లో అందరికీ ఐడీ కార్డులు
  • సెట్స్ పై ఐడీ కార్డు ఇదే ప్రథమం అన్న ఎన్టీఆర్
NTR with ID Card on RRR sets in Ukraine

టాలీవుడ్ అగ్రహీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ప్రస్తుతం ఉక్రెయిన్ లో చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా సెట్స్ పై మెడలో ఐడీ కార్డు వేసుకున్న ఫొటోలను జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.

ఎన్నో ఏళ్ల తర్వాత మళ్లీ ఐడీ కార్డు ధరించానని ఎన్టీఆర్ వెల్లడించారు. సెట్స్ మీద ఉండగా ఐడీ కార్డు వేసుకోవడం ఇదే ప్రథమం అని తెలిపారు. ఎన్టీఆర్ పంచుకున్న ఫొటోలో తన ఐడీ కార్డు చూపిస్తూ దర్శకుడు రాజమౌళి కూడా కనిపించాడు. కాగా, ఎన్టీఆర్ ఐడీ కార్డుపై ఫొటో, నందమూరి తారక రామారావు, హీరో అని రాసి ఉంది. ఐడీ కార్డు పైభాగంలో చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టయిన్ మెంట్ పేరు, ఆర్ఆర్ఆర్ అనే అక్షరాలు ముద్రించారు.