పులిచింతల ప్రాజెక్టు వరద నీటిపై గుంటూరు జిల్లా కలెక్టర్ హెచ్చరిక

05-08-2021 Thu 19:23
  • పులిచింతల ప్రాజెక్టు వద్ద కొట్టుకుపోయిన గేటు
  • దిగువకు భారీ మొత్తంలో నీరు
  • లోతట్టు ప్రాంతాలు జాగ్రత్తగా ఉండాలన్న కలెక్టర్
  • అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు
Guntur district collector warns flood situation

పులిచింతల ప్రాజెక్టు వద్ద ఓ క్రస్ట్ గేటు వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన నేపథ్యంలో, లోతట్టు ప్రాంతాలకు వరద ముప్పు ఉంటుందని అంచనా వేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టు వరద నీటిపై గుంటూరు జిల్లా కలెక్టర్ హెచ్చరిక జారీ చేశారు. కృష్ణా పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ముంపు ప్రాంతాల అధికారులు సన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు.

వరద సంభవించే అవకాశం ఉన్నందున ప్రజలు కాలువలు, వాగులు దాటరాదని హెచ్చరించారు. కాగా, కొట్టుకుపోయిన గేటు స్థానంలో ఎమర్జెన్సీ గేటు ఏర్పాటుకు ప్రాజెక్టు ఇంజినీరింగ్ సిబ్బంది చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి.