చరణ్ సినిమాకిగాను కియారా పారితోషికం 5 కోట్లు?
- చరణ్, శంకర్ కాంబోలో సినిమా
- బాలీవుడ్ లో కియారాకు భారీ క్రేజ్
- చేతినిండా పెద్ద ప్రాజెక్టులు
- తెలుగులో మూడో సినిమా
ఈ సినిమాకి గాను ఆమెకి అందుతున్న పారితోషికం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆమె డిమాండ్ చేసిన పారితోషికం 5 కోట్లు అని చెప్పుకుంటున్నారు. తెలుగులో ఇంతకుముందు ఆమె చేసిన రెండు సినిమాలకి కూడా ఒక కోటి లోపే పారితోషికంగా తీసుకుందట. కానీ అప్పటి పరిస్థితి వేరు .. ఇప్పుడు ఆమె రేంజ్ వేరు.
హిందీలో 'కబీర్ సింగ్' సినిమా తరువాత కియారా గ్రాఫ్ మారిపోయింది. ఆమెకి బాలీవుడ్ లో అవకాశాలు .. విజయాలు కూడా పెరిగిపోయాయి. అక్కడి స్టార్ హీరోయిన్స్ రేసులో ఆమె ఉంది. ప్రస్తుతం అక్కడ ఆమె ఒక సినిమాకి 4 కోట్లు తీసుకుంటోందట. శంకర్ - చరణ్ సినిమా తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో విడుదల కానుండటంతో, ఆమె మరో కోటి అదనంగా అడిగిందని అంటున్నారు.