ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షునిగా యార్లగడ్డ పదవీకాలం పొడిగింపు

05-08-2021 Thu 18:11
  • ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు
  • మరో రెండేళ్లు పొడిగిస్తూ నిర్ణయం
  • క్యాబినెట్ హోదా, ఇతర సదుపాయాలు వర్తింపు
  • 2023 ఆగస్టు 25 వరకు పదవిలో ఉండనున్న యార్లగడ్డ
Yarlagadda tenure extended for two years

ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షునిగా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పదవీకాలం పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యార్లగడ్డ పదవీకాలాన్ని మరో రెండు సంవత్సరాలు పొడిగిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తాజా ఉత్తర్వుల నేపథ్యంలో యార్లగడ్డ 2023 ఆగస్టు 25 వరకు పదవిలో కొనసాగనున్నారు. యార్లగడ్డకు ఏపీ క్యాబినెట్ హోదాతో పాటు మంత్రులకు లభించే జీతభత్యాలు, ఇతర సదుపాయాలు వర్తిస్తాయని రాష్ట్ర పర్యాటక, భాషా సాంస్కృతిక, క్రీడా, యువజన అభ్యుదయ శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.