అమెజాన్ ప్రైమ్ కి వెళ్లిన 'జై భీమ్'

05-08-2021 Thu 17:45
  • సూర్య హీరోగా 'జై భీమ్'
  • తొలిసారి లాయర్ పాత్రలో 
  • అమెజాన్ ప్రైమ్ కి అప్పగింత 
  • నవంబర్లో స్ట్రీమింగ్  
jai Bhim will release in Amazon prime

సూర్య కథానాయకుడిగా 'జై భీమ్' రూపొందింది. ఆయన సొంత బ్యానర్లోనే ఈ సినిమాను నిర్మించారు. ఇది ఒక యథార్థ సంఘటన ఆధారంగా చిత్రీకరించిన కథ. గిరిజనుల హక్కుల కోసం పోరాడిన ఒక లాయర్ కథ ఇది. ఆ పాత్రనే సూర్య ఇప్పుడు పోషించాడు. జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలకి ముస్తాబైంది.

అయితే ఈ సినిమాను ముందుగా థియేటర్లలోనే రిలీజ్ చేయాలనే ఆలోచన చేశారు. కానీ ఆ తరువాత ఆ నిర్ణయాన్ని మార్చుకుని ఓటీటీకి వెళ్లారు. భారీ ఆఫర్ రావడంతో ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ కి అప్పగించారు. నవంబర్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ వచ్చేసింది. తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో ఈ సినిమాను వీక్షించవచ్చు.

ఈ సినిమాలో సూర్య సరసన నాయికగా రజీషా విజయన్ కనిపించనుంది. ప్రకాశ్ రాజ్ ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. ఆయన పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా నిలిచిందని అంటున్నారు. లాయర్ పాత్రలో సూర్య తొలిసారిగా నటించిన ఈ సినిమాపై అందరిలోను ఆసక్తి ఉంది. ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి.