అనిల్ రావిపూడి దర్శకత్వంలో చరణ్!

05-08-2021 Thu 17:04
  • చివరి షెడ్యూల్లో 'ఆర్ ఆర్ ఆర్'
  • త్వరలో పట్టాలపైకి శంకర్ ప్రాజెక్టు
  • అనిల్ కథకు చరణ్ గ్రీన్ సిగ్నల్ 
  • నిర్మాణ సంస్థగా యూవీ క్రియేషన్స్  
Charan in Anil Ravipudi movie

తెలుగులో రాజమౌళి .. కొరటాల తరువాత ఇంతవరకూ అపజయం ఎరుగని దర్శకుడిగా అనిల్ రావిపూడికి పేరు ఉంది. ఒక్కో సినిమాకి తన రేంజ్ ను పెంచుకుంటూ వెళుతున్న అనిల్ రావిపూడి, ప్రస్తుతం 'ఎఫ్ 3' సినిమా షూటింగు పనులతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత ఆయన బాలకృష్ణ హీరోగా ఒక సినిమా చేయనున్నాడు.

అయితే బాలకృష్ణ తరువాత ప్రాజెక్టులో హీరో ఎవరు అనే ప్రశ్నకి సమాధానంగా చరణ్ పేరు వినిపిస్తోంది. ఇటీవలే అనిల్ రావిపూడి .. చరణ్ ను కలిసి ఒక కథను వినిపించాడట. కథ కొత్తగా ఉండటం .. తన పాత్రలో వైవిధ్యం ఉండటం .. ఇంతవరకూ టచ్ చేయని పాయింట్ కావడంతో, వెంటనే చరణ్ అంగీకరించినట్టుగా చెబుతున్నారు. ఈ సినిమాకి యూవీ క్రియేషన్స్ వారు నిర్మాతలుగా వ్యవహరించనున్నారని అంటున్నారు.

ప్రస్తుతం చరణ్ 'ఆర్ ఆర్ ఆర్' సినిమా షూటింగులో ఉన్నాడు. ఆ తరువాత సినిమాను ఆయన శంకర్ తో చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. శంకర్ సినిమాను పూర్తిచేసిన తరువాత అనిల్ రావిపూడి ప్రాజెక్టుపైకి చరణ్ రానున్నాడని అంటున్నారు.