ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై తీర్పును రిజర్వ్ లో ఉంచిన ఏపీ హైకోర్టు

05-08-2021 Thu 16:20
  • ఏపీలో ఇటీవల పరిషత్ ఎన్నికలు
  • కోర్టు ఆదేశాలతో నిలిచిన ఓట్ల లెక్కింపు
  • ఎన్నికలు రద్దు చేసిన సింగిల్ బెంచ్
  • డివిజన్ బెంచ్ ను ఆశ్రయించిన ఏపీ సర్కారు
AP High Court reserves verdict in Parishat elections issue

ఆమధ్య ఏపీలో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచ్ లో సవాల్ చేసిన విషయం విదితమే. దీనిపై హైకోర్టులో నేడు వాదనలు పూర్తయ్యాయి. న్యాయస్థానం తీర్పును రిజర్వ్ లో ఉంచింది.

అప్పట్లో ఎన్నికలకు తగిన సమయం లేకుండా నోటిఫికేషన్ ఇచ్చారని, ఇది సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధమని పేర్కొన్న సింగిల్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ దుర్గాప్రసాదరావు ఎన్నికలు రద్దు చేశారు. దాంతో ఏపీ ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. ఈ అప్పీల్ పై హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. ఇరు పక్షాల వాదనలు విన్న మీదట తీర్పును తర్వాత వెల్లడించాలని నిర్ణయించింది.