పులిచింతల ప్రాజెక్టు వద్దకు వెళ్లి 16వ నెంబరు గేటును పరిశీలించిన ఏపీ మంత్రులు

05-08-2021 Thu 14:50
  • పులిచింతల ప్రాజెక్టులో కొట్టుకుపోయిన గేటు
  • పులిచింతల వెళ్లిన మంత్రులు
  • అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్న వైనం
  • ప్రమాదవశాత్తు జరిగిందన్న పేర్ని నాని
AP Ministers visits Pulichintala project after a crest gate vanished

పులిచింతల ప్రాజెక్టు వద్ద 16వ నెంబరు క్రస్ట్ గేటు వరద ప్రవాహానికి కొట్టుకు పోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఏపీ మంత్రులు పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాసరావు, కొడాలి నాని పులిచింతల ప్రాజెక్టు వద్దకు వెళ్లారు. అక్కడ కొట్టుకుపోయిన 16వ నెంబరు గేటును పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

అనంతరం మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ, వరద తాకిడికి గేటు కొట్టుకుపోయిందని వెల్లడించారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటన అని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో నీటి ప్రవాహ సామర్థ్యం తగ్గిస్తేనే గేటును యథాస్థానంలో బిగించడం సాధ్యపడుతుందని స్పష్టం చేశారు. గేటును వీలైనంత త్వరగా ఏర్పాటు చేసేందుకు యత్నిస్తున్నారని పేర్ని నాని వివరించారు.