Pawan Kalyan: 4 ద‌శాబ్దాల అనంత‌రం మ‌న హాకీ క్రీడాకారుల బృందం ఒలింపిక్స్‌లో దేశ కీర్తి ప‌తాకాన్ని రెప‌రెప‌లాడించింది: ప‌వ‌న్ క‌ల్యాణ్

  • ఒలింపిక్స్ లో కాంస్య ప‌త‌కం సాధించ‌డంతో భార‌త్‌లో హాకీ ఆట‌కు పున‌ర్ వైభ‌వం
  • చిర‌కాల స్వ‌ప్నాన్ని నెర‌వేర్చిన క్రీడాకారుల‌కు శుభాకాంక్ష‌లు
  • ఇదే స్ఫూర్తిని కొన‌సాగించాలి
PawanKalyan on olympic games

టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య ప‌త‌కం సాధించ‌డంతో భార‌త్‌లో హాకీ ఆట‌కు పున‌ర్ వైభ‌వం వ‌స్తుంద‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. నాలుగు ద‌శాబ్దాల అనంత‌రం మ‌న హాకీ క్రీడాకారుల బృందం ఒలింపిక్స్‌లో దేశ కీర్తి ప‌తాకాన్ని రెప‌రెప‌లాడించడం ఎంతో సంతోషాన్ని క‌లిగించిందంటూ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. చిర‌కాల స్వ‌ప్నాన్ని నెర‌వేర్చిన క్రీడాకారుల‌కు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నాన‌ని పేర్కొన్నారు.

1980 మాస్కో ఒలింపిక్స్ త‌ర్వాత ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్‌లో మ‌న హాకీ జ‌ట్టు కాంస్యం గెలుచుకుని క్రీడాభిమానుల క‌ల‌ను నెర‌వేర్చింద‌ని స్తుతించారు. కాంస్య‌ ప‌త‌కం కోసం జ‌రిగిన పోటీలో బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థిని ఎదుర్కొని గెలిచార‌ని అన్నారు. ఇదే స్ఫూర్తిని కొన‌సాగిస్తూ రానున్న రోజుల్లో మ‌రిన్ని విజ‌యాలు సాధించాల‌ని ఆశిస్తున్నాన‌ని చెప్పారు.

          

More Telugu News