చివరి షెడ్యూల్ షూటింగును మొదలెట్టిన విశాల్!

05-08-2021 Thu 11:50
  • విశాల్ నుంచి 31వ సినిమా 
  • యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథ 
  • విశాల్ సరసన డింపుల్ హయతి 
  • త్వరలో రిలీజ్ డేట్ ప్రకటన
Final shoot of Vishal31 begins from today
విశాల్ కి తమిళనాట మాస్ హీరోగా మంచి క్రేజ్ ఉంది. ఆయన ఎంచుకునే కథల్లో మాస్ అంశాలు పుష్కలంగా ఉంటాయి. తెలుగులోను విశాల్ కి ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాలకి ఇక్కడ మంచి మార్కెట్ ఉంది. అందువలన ఆయన తన సినిమాలను తమిళంతో పాటుగా తెలుగులోను విడుదలయ్యేలా చూసుకుంటూ ఉంటాడు.

ప్రస్తుతం ఆయన తాజా చిత్రంగా 'నాట్ ఏ కామన్ మేన్' సినిమా రూపొందుతోంది. శరవణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమా షూటింగులోనే ఇటీవల విశాల్ గాయపడ్డాడు. పూర్తిగా కోలుకున్న ఆయన, మళ్లీ ఇప్పుడు షూటింగుకు హాజరయ్యాడు.

ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగు ఈ రోజునే మొదలైంది. ఈ రోజు నుంచి ఈ నెలాఖరు వరకూ జరిపే చిత్రీకరణతో షూటింగు పార్టు పూర్తవుతుంది. కెరియర్ పరంగా విశాల్ కి ఇది 31వ సినిమా. ఈ సినిమాలో ఆయన జోడీగా డింపుల్ హయతి అలరించనుంది. రమణ .. నంద .. యోగిబాబు ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.