Hyderabad: హైదరాబాద్‌లో మ్యాన్‌హోల్ లో చిక్కుకున్న‌ అంత‌య్య కోసం రెండో రోజు కొన‌సాగుతోన్న స‌హాయ‌క చ‌ర్య‌లు

rescue operation underway in lb nagar
  • హైదరాబాద్‌లోని సాహెబ్‌నగర్‌లో ఘ‌ట‌న‌
  • డ్రైనేజీని శుభ్రం చేసేందుకు దిగిన‌ ఇద్దరు కార్మికులు
  • నిన్న ఒక‌రి మృతి.. మ‌రొక‌రి గ‌ల్లంతు

హైదరాబాద్‌లోని వనస్థలిపురం పరిధిలోని సాహెబ్‌నగర్‌లో డ్రైనేజీని శుభ్రం చేసేందుకు దిగిన‌ ఇద్దరు కార్మికులు అందులోనే చిక్కుకుపోయిన‌ విష‌యం తెలిసిందే. వారి పేర్లు అంతయ్య, శివ అని ఇప్ప‌టికే అధికారులు చెప్పారు. నిన్న శివ మృతదేహాన్ని స‌హాయ‌క బృందాలు బ‌య‌ట‌కు తీశాయి. ఈ రోజు ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించనున్నారు.

అయితే, గ‌ల్లంతైన‌ అంత‌య్య ఆచూకీ మాత్రం ఇప్ప‌టికీ ల‌భ్యం కాలేదు. రెండో రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం నాలాను తవ్వుతోంది. రాత్రి స‌మ‌యంలో నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా మురికి కాలువలోకి దిగాల‌ని కాంట్రాక్టర్ చెప్ప‌డంతో మొద‌ట శివ మ్యాన్‌హోల్‌లోకి దిగాడు. అతను అందులోనే చిక్కుకుపోవడంతో కాపాడేందుకు వెళ్లిన అంతయ్య కూడా చిక్కుకుపోయాడు. దీంతో కాంట్రాక్టర్ స్వామిపై పోలీసులు కేసు నమోదు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News