తెలంగాణలో కొత్తగా 623 కరోనా పాజిటివ్ కేసులు
- గత 24 గంటల్లో 1,12,796 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 77 కేసులు
- నారాయణపేట జిల్లాలో కొత్త కేసులు నిల్
- రాష్ట్రంలో ముగ్గురి మృతి
- ఇంకా 8,803 మందికి చికిత్స
రాష్ట్రంలో ఇప్పటివరకు 6,47,229 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,34,612 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 8,803 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 3,814కి చేరింది.
