నవ్వులు పూయిస్తున్న 'వివాహభోజనంబు' ట్రైలర్!

04-08-2021 Wed 19:01
  • హీరోగా కమెడియన్ సత్య 
  • లాక్ డౌన్ నేపథ్యంలో సాగే కథ
  • నిర్మాతగా సందీప్ కిషన్ 
  • సోనీ లైవ్ ఓటీటీ ద్వారా రిలీజ్
Vivaha Bhojanambu trailer released

'వివాహ భోజనంబు' సినిమాతో కమెడియన్ సత్య హీరోగా మారిపోయాడు. ఆయన కథానాయకుడిగా ఈ సినిమాను రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నిర్మించారు. హీరో సందీప్ కిషన్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించడం విశేషం. ఈ సినిమాను సోనీ లైవ్ ఓటీటీ ద్వారా త్వరలో విడుదల చేయనున్నారు. సోనీ లైవ్ ద్వారా రిలీజ్ అవుతున్న తొలి తెలుగు సినిమా ఇదే.

తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. లాక్ డౌన్ నేపథ్యం చుట్టూ అల్లుకున్న హాస్యభరిత కథ ఇది అనే విషయం ట్రైలర్ ను బట్టి అర్థమవుతుంది. సత్య చాలా పొదుపరి ..  ప్రతి పైసా ఆచూతూచి ఖర్చు చేసే టైపు. అతని పెళ్లికి బందువులు వస్తారు. పెళ్లి కాగానే లాక్ డౌన్ పడిపోతుంది. దాంతో బంధువులంతా ఆయన ఇంట్లోనే తిష్ఠ వేస్తారు.

ఇక వాళ్లను పోషించడానికి ఆయన పడిన అవస్థలే ఈ సినిమా. చాలామంది ఇలాంటి అనుభవాలు పొందినవారే కనుక, కాన్సెప్ట్ చాలా సరదాగా అనిపిస్తోంది. ఈ సినిమాతో కొత్త కథానాయిక పరిచయమవుతోంది. ఈ సినిమాలో సందీప్ కిషన్ కూడా అతిథి పాత్రలో కనిపించనున్నాడు. ఓటీటీ ద్వారా ఈ సినిమా ఏ స్థాయి రెస్పాన్స్ రాబడుతుందో చూడాలి.