టోక్యో ఒలింపిక్స్: హాకీ సెమీస్ లో ఓటమిపాలైన భారత మహిళల జట్టు

04-08-2021 Wed 17:42
  • టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు మరో నిరాశ
  • హాకీ సెమీస్ లో అర్జెంటీనా చేతిలో 1-2తో ఓటమి
  • మూడో స్థానం కోసం పోటీపడనున్న భారత్
  • ఇందులో గెలిస్తే కాంస్యం
Indian eves lost to Argentina in Tokyo Olympics hockey semifinals

టోక్యో ఒలింపిక్స్ లో భారత మహిళల హాకీ జట్టు ఓటమిపాలైంది. ఈ మధ్యాహ్నం అర్జెంటీనా జట్టుతో జరిగిన సెమీఫైనల్ సమరంలో భారత అమ్మాయిలు 1-2 తేడాతో పరాజయం చవిచూశారు. ఈ మ్యాచ్ ప్రారంభమైన రెండో నిమిషంలోనే గోల్ సాధించి ఆధిక్యంలోకి వెళ్లిన భారత అమ్మాయిలు... ఆపై అదే ఊపును కొనసాగించలేకపోయారు.

భారత డిఫెన్స్ బలహీనంగా ఉండడాన్ని సొమ్ము చేసుకున్న అర్జెంటీనా 18, 36వ నిమిషాల్లో గోల్స్ చేసి ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అర్జెంటీనా ఆధిక్యాన్ని సమం చేయడానికి భారత్ విఫలయత్నం చేసింది.

ఈ ఓటమి అనంతరం భారత్ మూడో స్థానం కోసం జరిగే వర్గీకరణ మ్యాచ్ పై దృష్టి నిలిపింది. ఇందులో గెలిస్తే భారత్ కు కాంస్యం దక్కుతుంది .