సునీల్ యాదవ్ ను పులివెందుల కోర్టులో హాజరుపర్చిన సీబీఐ అధికారులు

04-08-2021 Wed 17:28
  • వివేకా హత్యకేసులో అనుమానితుడిగా సునీల్ యాదవ్
  • గోవాలో అరెస్ట్ చేసిన సీబీఐ
  • కడప సెంట్రల్ జైలులో ప్రశ్నలు గుప్పించిన అధికారులు
  • ఈ మధ్యాహ్నం పులివెందుల తరలింపు
CBI officials produced Sunil Yadav at Pulivendula court

మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక అనుమానితుడిగా ఉన్న సునీల్ యాదవ్ ను సీబీఐ అధికారులు గోవాలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అతనిని కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్ లో ఉంచి ప్రశ్నిస్తున్న సీబీఐ అధికారులు ఈ మధ్యాహ్నం పులివెందుల తరలించారు. అక్కడి కోర్టులో న్యాయమూర్తి ఎదుట అతడిని హాజరుపరిచారు.

కాగా, గత రెండు నెలులుగా వివేకా హత్యకేసు దర్యాప్తు కొనసాగిస్తున్న సీబీఐ... ఇప్పటికే కీలక ఆధారాలను సేకరించినట్టు తెలుస్తోంది. వివేకా హత్య జరిగింది 2019లో కాగా, ఇన్నాళ్లకు కీలక నిందితుడ్ని అరెస్ట్ చేయడం సీబీఐ వద్ద బలమైన ఆధారాలు ఉన్నాయన్న విషయాన్ని నిరూపిస్తోంది.