విజయవాడ-గుడివాడ సెక్షన్లో ఈ నెల 14 వరకు పలు రైళ్ల రద్దు

04-08-2021 Wed 17:09
  • విజయవాడ-ఉప్పులూరు మధ్య ట్రాక్ మరమ్మతులు
  • 22 రైళ్లు రద్దు, 3 రైళ్ల పాక్షిక రద్దు
  • 9 రైళ్ల దారిమళ్లింపు, 2 రైళ్ల రీషెడ్యూల్
  • ప్రకటన చేసిన రైల్వేశాఖ
Trains schedule changed in Vijayawada and Gudiwada section

విజయవాడ-గుడివాడ సెక్షన్లో ఈ నెల 14 వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. విజయవాడ-ఉప్పులూరు మధ్య రైల్వే ట్రాక్ మరమ్మతు పనుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కొన్ని రైళ్ల రద్దుతో పాటు, పలు రైళ్లను దారిమళ్లిస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 14 వరకు విజయవాడ-గుడివాడ మీదుగా వెళ్లే 22 రైళ్లను రద్దు చేయనున్నారు. 9 రైళ్లను దారిమళ్లిస్తున్నామని, 2 రైళ్లను రీషెడ్యూల్ చేస్తున్నామని, 3 రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నామని రైల్వే శాఖ అధికారులు వివరించారు.