హైద‌రాబాద్‌లో క‌ల‌క‌లం... డిగ్రీ ఫ‌స్టియ‌ర్ విద్యార్థినిని హత్య చేసి, రైల్వే ట్రాక్‌పై పడేసిన వైనం

04-08-2021 Wed 13:30
  • అల్వాల్ పోలీస్ స్టేష‌న్ పరిధిలో ఘ‌ట‌న‌
  • మొన్న‌ ఉదయం ఇంటి నుంచి వెళ్లిన విద్యార్థిని
  • రాత్రి అయిన‌ప్ప‌టికీ ఆమె తిరిగి రాక‌పోవ‌డంతో ఫిర్యాదు
  • ఉరి వేసి, హత్య చేసి రైల్వే ట్రాక్‌పై పడేసినట్లు అనుమానాలు
student kills by lover

హైద‌రాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేష‌న్ పరిధిలో క‌ల‌క‌లం చెల‌రేగింది. ఓ అమ్మాయిని హత్య చేసి, రైల్వే ట్రాక్‌పై ప‌డేశారు. ఆమె ప్రియుడే ఈ ఘాతుకానికి పాల్ప‌డిన‌ట్లు అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. బోయిన్‌పల్లి ఒమేగా కాలేజీలో డిగ్రీ ఫస్టియర్ చ‌దువుతోన్న విద్యార్థిని (17) మొన్న‌ ఉదయం ఇంటి నుంచి వెళ్లింది. రాత్రి అయిన‌ప్ప‌టికీ ఆమె తిరిగి రాక‌పోవ‌డంతో నిన్న ఆమె బంధువులు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రైల్వే ట్రాక్‌పై ఆమె మృతదేహాన్ని గుర్తించారు. ఆ విద్యార్థినిని ఉరి వేసి హత్య చేసి రైల్వే ట్రాక్‌పై పడేసినట్లు స‌మాచారం. మృతురాలి స్నేహితురాలు ఇచ్చిన స‌మాచారం ప్ర‌కారం ఇప్ప‌టికే నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై పూర్తి స‌మాచారం అందాల్సి ఉంది.