తాప్సీ 'మిషన్ ఇంపాజిబుల్'లో మలయాళ నటుడు!

04-08-2021 Wed 12:05
  • తాప్సీ ప్రధాన పాత్రధారిగా 'మిషన్ ఇంపాజిబుల్'
  • హైదరాబాదులో జరుగుతున్న షూటింగు
  • షూటింగులో జాయినవుతున్న హరీశ్ పేరడి
  • సినిమాకి హైలైట్ గా నిలిచే పాత్ర  
Mishan Impossible movie update

కొంతకాలంగా వరుసగా హిందీ సినిమాలు చేసుకుంటూ వెళుతోన్న తాప్సీ, కొంత గ్యాప్ తరువాత తెలుగు సినిమా చేయడానికి అంగీకరించింది. విభిన్నమైన కథాకథనాలతో రూపొందుతోన్న ఆ సినిమా పేరే 'మిషన్ ఇంపాజిబుల్'. గతంలో 'ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ' సినిమాతో హిట్ కొట్టిన స్వరూప్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.

తాప్సీ ప్రధానమైన పాత్రను పోషిస్తున్న ఈ సినిమా, ప్రస్తుతం హైదరాబాదులో షూటింగు జరుపుకుంటోంది. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం మలయాళ నటుడు 'హారీష్ పేరడి'ని తీసుకున్నారు. మలయాళంలోను .. తమిళంలోను విలన్ గా ఆయన చాలా పాప్యులర్. ఆయన విలనిజం చాలా సైలెంట్ గా .. డీసెంట్ గా ఉంటుంది.

'స్పైడర్' .. 'ఖైదీ' .. 'కో కో కోకిల' సినిమాలతో ఆయన తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. ఈ సినిమాకి ఆయన పాత్ర హైలైట్ అవుతుందని అంటున్నారు. నిరంజన్ రెడ్డి .. అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి మార్క్ కె. రాబిన్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఈ సినిమాతో తాప్సీ మళ్లీ తెలుగులో పుంజుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.