షారుక్ .. అట్లీ కుమార్ కాంబో నుంచి రానున్న స్పెషల్ టీజర్!

  • తమిళనాట అట్లీ కుమార్ కి మంచి క్రేజ్ 
  • షారుక్ తో చేయాలనే తపన
  • రెండేళ్లకి ఓకే అయిన ప్రాజెక్టు 
  • ఆగస్టు 15న స్పెషల్ టీజర్ రిలీజ్    
Shahrukh Khan new movie update

కోలీవుడ్లో ఏ దర్శకుడైనా విజయ్ తో ఒక సినిమా చేస్తే చాలు అనుకుంటారు. అంతకు మించిన అదృష్టం లేదని భావిస్తారు. ఆ దిశగా కొన్ని ఏళ్ల పాటు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అలాంటి విజయ్ కి వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన దర్శకుడిగా అట్లీ కుమార్ కనిపిస్తాడు. ప్రస్తుతం ఆయన షారుక్ తో సినిమా చేసే పనిలో ఉన్నాడు.

షారుక్ తో ఎలాగైనా ఒక సినిమా చేయాలనే ఉద్దేశంతో అట్లీ కుమార్ ముంబైలో మకాం పెట్టాడు. షారుక్ ని కలుసుకుని ఆయనకి ఒక కథ వినిపించాడు. అయితే షారుక్ ఒక పట్టాన ఆయన కథను ఓకే చేయలేదు. అలా అని చెప్పేసి అసహనంతో అట్లీ కుమార్ వెనక్కి వచ్చేయలేదు. షారుక్ కోరిన విధంగా మార్పులు .. చేర్పులు చేస్తూ వెళ్లాడు. అప్పుడు గానీ షారుక్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదట.

త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టనున్నారు. అయితే ఈ లోగా షారుక్ పై ఒక టీజర్ ను అట్లీ కుమార్ రెడీ చేస్తున్నాడట. ముంబైలోని ఒక స్టూడియోలో స్పెషల్ సెట్ వేయించి షారుక్ పై కొన్ని షాట్స్ చిత్రీకరిస్తున్నాడట. ఈ టీజర్ ను ఆగస్టు 15వ తేదీన వదలనున్నట్టు చెబుతున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.  

More Telugu News