సునీల్ హీరోగా సైకలాజికల్ థ్రిల్లర్!

04-08-2021 Wed 10:12
  • తెరపైకి మరో సైకలాజికల్ థ్రిల్లర్
  • తొలిసారిగా కొత్త జోనర్లో సునీల్  
  • దర్శకుడిగా అంజి పరిచయం
  • ముఖ్యమైన పాత్రలో ధన్ రాజ్
Sunil New movie is Bujji Ila Ra

తెలుగులో ఇటీవల కాలంలో సైకలాజికల్ థ్రిల్లర్ల జోరు పెరుగుతోంది. ఈ తరహా సినిమాలకు ఆదరణ కూడా బాగానే ఉంది. ఓటీటీల్లో కూడా ఈ జోనర్ సినిమాలనే ఎక్కువగా చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ జోనర్లో ఒక సినిమా చేయడానికి సునీల్ రంగంలోకి దిగిపోయాడు. ఆ సైకలాజికల్ థ్రిల్లర్ పేరే .. 'బుజ్జీ ఇలా రా'.

ఈ సినిమా సునీల్ ప్రధాన పాత్రధారిగా రూపొందుతోంది. సునీల్ హీరోగా మారినప్పటి నుంచీ, విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ వెళుతున్నాడు. ఒక్క కామెడీనే కాకుండా వేరియేషన్స్ తో కూడిన పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ, మళ్లీ కుదురుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన తొలిసారిగా ఈ జోనర్లో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు.

అంజి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాకి, సాయికార్తీక్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. అగ్రహారం నాగిరెడ్డి .. సంజీవ్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో ధన్ రాజ్ కూడా ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. ఈ సినిమాతో చాందిని కథానాయికగా ఎంట్రీ ఇస్తోంది. సునీల్ వైపు నుంచి జరుగుతున్న ఈ ప్రయోగం ఎంతవరకూ ఫలిస్తుందో చూడాలి మరి.