ఈ నెల 9న లక్షమందితో ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ
- దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా పేరుతో బహిరంగ సభ
- 18 ఎకరాల స్థలాన్ని లీజుకు తీసుకుని ఏర్పాట్లు
- 7న స్థలాన్ని సందర్శించనున్న నేతలు
పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు, మాజీ విప్ అనిల్, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి తదితరులు నిన్న పీసీసీ మాజీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జెట్టి కుసుమకుమార్ నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సభ ఏర్పాట్లు, జన సమీకరణ, ఇతర అంశాలపై చర్చించారు.