టోక్యో ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన భార్యాభర్తలు

04-08-2021 Wed 10:03
  • పతకాలు సాధించిన బ్రిటన్ దంపతులు
  • రజత పతకాలను గెలిచిన జంట
  • లండన్, రియో ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్స్ సాధించిన వైనం
Wife and husband win medals in Tokyo olympics

ఒలింపిక్స్ కు క్వాలిఫై అయితేనే చాలనుకునే ఆటగాళ్లు ఎందరో ఉంటారు. జీవితంలో ఒక్క ఒలింపిక్ పతకం సాధించినా ఎంతో గొప్ప అనుకుంటుంటారు. అలాంటిది భార్యాభర్తలిద్దరూ పతకం సాధిస్తే... అది మామూలు విషయం కాదు. బ్రిటన్ కు చెందిన భార్యాభర్తలు జాసన్ కెన్నీ, లౌరాలు దీన్ని నిజం చేశారు. ఇద్దరూ పతకాలను సాధించారు. అయితే, పతకాలు సాధించడం వీరికి ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా కొన్ని ఒలింపిక్స్ లలో వీరు పతకాలను సాధించారు. 2012 లండన్ ఒలింపిక్స్ లో ఇద్దరూ గోల్డ్ మెడల్స్ సాధించారు. 2016 రియో ఒలింపిక్స్ లో కూడా పసిడి పతకాలను గెలుచుకున్నారు. ఇప్పుడు టోక్యోలో ఇరువురూ రజత పతకాలను సాధించారు.