సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

04-08-2021 Wed 07:28
  • ధనుష్ సినిమాలో రాశీఖన్నాకు ఛాన్స్
  • ఉక్రెయిన్ లో పాటలు మొదలెట్టిన 'ఆర్ఆర్ఆర్' 
  • అక్షయ్ సినిమాకి రమేశ్ వర్మ దర్శకత్వం  
Rashi Khanna gets a big offer from Kollywood

*  ప్రస్తుతం తెలుగులో 'పక్కా కమర్షియల్', 'థ్యాంక్యూ' సినిమాలలో నటిస్తున్న కథానాయిక రాశీఖన్నాకు కోలీవుడ్ నుంచి భారీ ఆఫర్ వచ్చింది. ధనుష్ హీరోగా నటించే 44వ సినిమాలో కథానాయికగా నటించే అవకాశం రాశీఖన్నాకు వచ్చిందట.
*  రాజమౌళి రూపొందిస్తున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రానికి సంబంధించిన రెండు పాటల చిత్రీకరణ కోసం యూనిట్ నిన్న ఉక్రెయిన్ చేరుకుంది. నేటి నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తారు. ఈ షూటింగులో ఎన్టీఆర్, చరణ్, అలియా భట్, ఒలీవియా పాల్గొంటున్నారు. ఈ షూటింగుతో చిత్ర నిర్మాణం పూర్తవుతుంది.
*  ప్రస్తుతం 'ఖిలాడి' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న రమేశ్ వర్మ దీని తర్వాత ఓ హిందీ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. గతంలో తన దర్శకత్వంలో వచ్చిన 'రాక్షసుడు' చిత్రాన్ని ఆయన హిందీలో రీమేక్ చేస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తాడని తెలుస్తోంది.