బాలీవుడ్ సింగర్, నటుడు యోయో హనీ సింగ్‌పై గృహహింస కేసు
- లైంగికంగా, మానసికంగా వేధిస్తున్నాడంటూ కోర్టులో పిటిషన్
- శాలినికి అనుకూలంగా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు
- 28లోగా సమాధానం ఇవ్వాలంటూ హనీసింగ్‌కు నోటీసులు
ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం హనీసింగ్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28లోగా సమాధానం ఇవ్వాలని అందులో పేర్కొంది. ఇద్దరి పేరుపై ఉన్న ఉమ్మడి ఆస్తులకు సంబంధించి కోర్టు అనుమతి లేకుండా ఎలాంటి లావాదేవీలు జరపవద్దని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.