కౌన్సిలర్ ప్రమీల గౌడ్ ఆత్మహత్య

03-08-2021 Tue 21:45
  • బొల్లారం 11వ వార్డ్ కౌన్సిలర్ ఆత్మహత్య
  • కుటుంబ కలహాలే కారణమని ప్రాథమిక నిర్ధారణ
  • పోస్టుమార్టం కోసం పటాన్ చెరు ఆసుపత్రికి మృతదేహం తరలింపు
Counselor Prameela Gowd Suicide

హైదరాబాద్ శివార్లలోని బొల్లారం మున్సిపాలిటీ 11వ వార్డ్ కౌన్సిలర్ ప్రమీల గౌడ్ (40) ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబసభ్యుల సమాచారం మేరకు, గత కొన్నాళ్లుగా కుటుంబంలో కలహాలు తలెత్తడంతో, ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దీంతో ఇంట్లోని బెడ్రూమ్ లో ఫ్యాన్ కు ఉరి వేసుకున్నారు. ఈ ఘటనను చూసిన కుటుంబసభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం పటాన్ చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.