telangana: తెలంగాణలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు

Media Bulletin on status of positive cases in Telangana
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య ఈరోజు స్వల్పంగా పెరిగింది. గత 24 గంటల్లో కొత్తగా 609 కేసులు నమోదయ్యాయి. వీటిలో జీహెచ్ఎంసీ పరిధిలో నమోదైనవి 81 కేసులు. ఇదే సమయంలో 647 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నలుగురు కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు.

మరోవైపు రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,46,606కి పెరిగింది. వీరిలో 6,34,018 మంది కోలుకోగా... 3,811 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 8,777 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ రోజు 1,08,921 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది

Go Back to Shorts
telangana
Corona Virus
Updates

More Telugu News