ఇళ్లను కూల్చివేయడం దారుణం: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

03-08-2021 Tue 20:29
  • రైలు పట్టాల పక్కనున్న ఇళ్లను కూల్చేసిన రైల్వే అధికారులు
  • బాధితులను పరామర్శించిన ప్రవీణ్ కుమార్
  • డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేయాలని డిమాండ్
RS Praveen Kumar responds on demolition of houses in Kothagudem

కొత్తగూడెంలో ఇళ్లను కూల్చివేయడాన్ని మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తప్పుపట్టారు. ముందస్తు హెచ్చరికలు కూడా లేకుండా ఇళ్లను కూల్చి వేయడం దారుణమని అన్నారు. పాతకొత్తగూడెంలో రైలు పట్టాల పక్కన నిర్మించుకున్న ఇళ్లను రైల్వే అధికారులు కూల్చేశారు. ఈ నేపథ్యంలో కొత్తగూడెం వెళ్లిన ప్రవీణ్ కుమార్ ఇళ్లు కోల్పోయిన బాధితులను పరామర్శించారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇళ్లు కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు స్థానిక ఎమ్మెల్యే ఇచ్చిన హామీలను నెరవేర్చాలని... లేని పక్షంలో ప్రత్యక్ష ఆందోళనలకు దిగుతామని అన్నారు.