మహిళా ట్రైనీ ఎస్సైపై లైంగిక వేధింపులు.. ఎస్సై శ్రీనివాస్ రెడ్డి సస్పెన్షన్

03-08-2021 Tue 20:32
  • మహబూబాబాద్ జిల్లా మరిపెడ ఎస్సైగా పని చేస్తున్న శ్రీనివాస్ రెడ్డి
  • అడవుల్లోకి తీసుకెళ్లి అత్యాచారయత్నం చేశాడన్న మహిళా ట్రైనీ ఎస్సై
  • అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు 
SI Srinivas Reddy suspended for rape attempt on trainee woman SI

మహిళా ట్రైనీ ఎస్సై పట్ల లైంగిక వేధింపులకు పాల్పడిన ఎస్సైపై వేటు పడింది. వివరాల్లోకి వెళ్తే... మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా పని చేస్తున్న శ్రీనివాస్ రెడ్డి తనపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడంటూ... మహిళా ట్రైనీ ఎస్సై వరంగల్ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలని కమిషనర్ ను కోరారు.

నిన్న రాత్రి అడవిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించాడని చెప్పారు. ఈ నేపథ్యంలో ఎస్సై శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించిన ఉన్నతాధికారులు శ్రీనివాస్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.