తిరుపతిలోనే పెళ్లి చేసుకుంటా: జాన్వీ కపూర్

03-08-2021 Tue 19:26
  • నేను చేసుకోబోయే వాడికి తెలివితేటలుంటే చాలు
  • పెళ్లి పనులు మూడు రోజుల్లో ముగిసిపోవాలి
  • చెన్నైలో అమ్మ ఉన్న ఇంట్లో మెహందీ, సంగీత్ కార్యక్రమాలు
I will marry in Tirupati says Janvi Kapoor

సినిమా స్టార్ల పెళ్లిళ్లంటే భారీ హంగామా ఉంటుంది. విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగులు, ఇండియాలో భారీ రిసెప్షన్ లు ఇవన్నీ చాలా కామన్. అయితే దివంగత శ్రీదేవి కూతురు, బాలీవుడ్ యువనటి జాన్వీ కపూర్ మాత్రం ఇండియాలోనే తాను పెళ్లి చేసుకుంటానని చెపుతోంది. తనను చేసుకోబోయే వాడికి తెలివితేటలుంటే చాలని చెప్పింది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన మనసులోని ఆలోచనలను వెల్లడించింది.

తమ పెళ్లి పనులన్నీ మూడు రోజులలోనే ముగిసిపోవాలని జాన్వీ కపూర్ తెలిపింది. కాప్రి ఐలాండ్ లో ఓ ప్రైవేట్ బోట్ లో తన స్నేహితులతో బ్యాచిలర్ పార్టీ చేసుకుంటానని చెప్పింది. ఆ తర్వాత తిరుపతిలో పెళ్లి చేసుకుంటానని తెలిపింది. చెన్నైలోని మైలాపూర్ లో అమ్మ నివసించిందని... ఆమె నివసించిన ఇంట్లో మెహందీ, సంగీత్ కార్యక్రమాలు జరగాలని చెప్పింది. పెళ్లికి దక్షిణాది సంప్రదాయ చీర ధరించాలనేది తన కోరికని తెలిపింది. ఏదేమైనప్పటికీ తన తల్లి వైపు నుంచి సంక్రమించిన దక్షిణాది సంప్రదాయాలకు జాన్వీ పెద్దపీట వేస్తుండటం సంతోషకరం.