దేవలోక 'రంభ'గా బిగ్ బాస్ బ్యూటీ మోనాల్!

03-08-2021 Tue 18:58
  • 'సుడిగాడు'తో టాలీవుడ్ ఎంట్రీ 
  • హీరోయిన్ గా తగ్గిన అవకాశాలు 
  • 'బిగ్ బాస్ 4'తో పెరిగిన క్రేజ్ 
  • ఐటమ్ సాంగ్స్ పై దృష్టి
Monal item song in Bangarraju movie

'సుడిగాడు' .. 'బ్రదర్ ఆఫ్ బొమ్మాళి' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మోనాల్ గజ్జర్ చేరువైంది. అయితే ఆ తరువాత చేసిన సినిమాలు అంతగా ఆడకపోవడంతో, అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. దాంతో ఆమె గుజరాతీ సినిమాలతో బిజీ అయింది. ఈ నేపథ్యంలోనే తెలుగు 'బిగ్ బాస్'లో ఆమెకి అవకాశం వచ్చింది. మోనాల్ చేసిన సినిమాల సంగతి అటుంచితే, బిగ్ బాస్ హౌస్ లో ఆమె చేసిన అందాల సందడి అందరికీ గుర్తుండిపోయింది.

బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన తరువాత టీవీ షోస్ ద్వారా ఆమె బిజీ అయింది. అదే సమయంలో ఆమె 'అల్లుడు అదుర్స్' సినిమాలో ఒక హాట్ హాట్ ఐటమ్ సాంగ్ చేసింది. ఇప్పుడు మళ్లీ 'బంగార్రాజు' సినిమాలోను ఆమె ఒక ఐటమ్ లో మెరవనుందని అంటున్నారు. ఈ సినిమాలో ఆమె స్వర్గం ఎపిసోడ్ లో తన అందాలు ఆరబోస్తుందని చెప్పుకుంటున్నారు.  

'సోగ్గాడే చిన్నినాయనా' సినిమాలో హీరో ఆత్మగా భూలోకానికి వచ్చి సందడి చేస్తాడు. అలాగే ఈ సినిమాలో బంగార్రాజు స్వర్గంలో ఉంటాడు. అక్కడ అప్సరసలను ఆటపట్టిస్తూ హ్యాపీగా ఉంటాడు. ఈ క్రమంలోనే 'రంభ'తో ఆడిపాడతాడు. ఆ రంభ పాత్ర కోసమే మోనాల్ ను ఎంపిక చేశారని అంటున్నారు. ఈ విషయంపై ఇంకా క్లారిటీ రావలసి ఉంది.