హిందీ 'ఛత్రపతి ' కోసం బెల్లంకొండ కసరత్తు!
- బాలీవుడ్ పై బెల్లంకొండ దృష్టి
- సెట్స్ పై 'ఛత్రపతి' హిందీ రీమేక్
- మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ
- హిందీ భాషపై పట్టు కోసం ప్రయత్నాలు
కరోనా కారణంగా ఆలస్యమైన ఈ సినిమా షూటింగు, ఇటీవలే మొదలైంది. బాలీవుడ్ ప్రేక్షకులు కండలు తిరిగిన హీరోలను .. యాక్షన్ ఎపిసోడ్స్ ను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. సల్మాన్ .. హృతిక్ రోషన్ .. జాన్ అబ్రహం .. టైగర్ ష్రాఫ్ .. ఇలా ఆ జాబితాలో చాలామంది హీరోలు కనిపిస్తారు.
అందువలన బెల్లంకొండ శ్రీనివాస్ జిమ్ లో గట్టిగానే కసరత్తు చేస్తున్నాడు. మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకుంటున్నాడు. ఇక హిందీ భాషపై పట్టు సాధించే పని కూడా చేస్తున్నాడు. ఈ మాటలన్నీ ఆయన చెప్పినవే. ఇలా బాలీవుడ్ ఆడియన్స్ ను మెప్పించడానికి శ్రీనివాస్ తనవంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. దూకుడు మీదే ఉన్న ఈ కుర్రాడు అక్కడ ఎన్ని మార్కులు తెచ్చుకుంటాడో చూడాలి మరి.