ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధుకు ఢిల్లీలో ఘన స్వాగతం

03-08-2021 Tue 17:18
  • ఉమెన్స్ సింగిల్స్ లో కాంస్య పతకం సాధించిన సింధు
  • వరుసగా రెండు ఒలింపిక్స్ లో మెడల్స్ సాధించిన ఘనత
  • ప్రధాని, కేంద్ర మంత్రులను కలవనున్న సింధు
PV Sindhu receives grand welcome in Delhi

టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకాన్ని గెలిచి, దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేసిన షట్లర్ పీవీ సింధు స్వదేశానికి చేరుకుంది. టోక్యో నుంచి ఢిల్లీకి చేరుకున్న ఆమెకు... ఢిల్లీ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. పెద్ద సంఖ్యలో విమానాశ్రయానికి చేరుకున్న అభిమానులు జయహో ధ్వానాలతో ఆమెకు స్వాగతం పలికారు. ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులను సింధు కలవనుంది.

వరుసగా రెండు ఒలింపిక్స్ లలో పతకాన్ని సాధించిన తొలి భారతీయురాలిగా సింధు రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. కాంస్య పతక పోరులో చైనాకి చెందిన హీ బింగ్ జివోతో జరిగిన మ్యాచ్ లో 21-13, 21-15 తేడాతో సింధు గెలుపొందింది. సింధు సాధించిన కాంస్య పతకంతో భారత్ పతకాల సంఖ్య రెండుకు చేరుకుంది.