ముగ్గురు నటీమణులు కలసి నటిస్తున్న సినిమా!

  • శర్వానంద్ హీరోగా 'ఆడవాళ్లు మీకు జోహార్లు' 
  • కిషోర్ తిరుమల దర్శకత్వం.. నాయికగా రష్మిక
  • మూడు కీలక పాత్రలలో రాధిక, ఖుష్బూ, ఊర్వశి  
  • ప్రత్యేక పోస్టర్లు విడుదల చేసిన చిత్ర నిర్మాణ సంస్థ  
Three veterns act together in a movie

ఇటీవలి కాలంలో నాటితరం కథానాయికలు అప్పుడప్పుడు ముఖ్య పాత్రల్లో నటిస్తుండడం మనం చూస్తూనే వున్నాం. అత్త.. తల్లి.. వంటి ఇంపార్టంట్ క్యారెక్టర్ వున్నప్పుడు నిన్నటి తరం కథానాయికలను తీసుకోవడం మనం చూస్తున్నాం. అయితే, ఇప్పుడు ఏకంగా అలాంటి ముగ్గురు నటీమణులు కలసి ఓ చిత్రంలో నటించనుండడం విశేషంగా చెప్పుకోవాలి. వారే రాధిక.. ఊర్వశి.. ఖుష్బూ!
 
యంగ్ హీరో శర్వానంద్ హీరోగా 'ఆడవాళ్లు మీకు జోహార్లు' పేరిట తాజాగా ఓ చిత్రం రూపొందుతున్న సంగతి విదితమే. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హాట్ బ్యూటీ రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. ఇందులో మూడు కీలక పాత్రలు వున్నాయి. మూడు పాత్రలూ కూడా డిఫరెంట్ గా సాగుతాయట. ఈ పాత్రలకు సీనియర్ నటీమణులు అయితే బాగుంటుందన్న ఉద్దేశంతో తాజాగా రాధిక, ఖుష్బూ, ఊర్వశిలను ఎంచుకున్నట్టు తెలుస్తోంది.

ఈ ముగ్గురూ ఇందులో నటిస్తున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ తాజాగా ప్రకటిస్తూ, స్పెషల్ పోస్టర్లు విడుదల చేసింది. తమ బృందంలోకి వీరికి స్వాగతం పలుకుతున్నట్టు పేర్కొంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాదులో జరుగుతోంది. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై నిర్మితం అవుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

More Telugu News