Telangana: 2031 తర్వాతే తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన.. కేంద్రం స్పష్టీకరణ

  • ఆర్టికల్ 170 ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన  
  • 2026 జనాభా లెక్కల ప్రకారం నిర్వహణ
  • రేవంత్ ప్రశ్నకు హోం శాఖ సమాధానం
Constituencies Re Organisation Only After 2031 Says Center

తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన ఇప్పుడు లేనట్టేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎప్పుడు చేసేది వెల్లడించింది. నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి లోక్ సభలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 2031 తర్వాతే నియోజకవర్గాలను పునర్విభజిస్తామని స్పష్టం చేశారు. 2026 జనాభా లెక్కల ప్రకారం చేపడతామన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని ఆయన తెలిపారు.

More Telugu News