బండ్ల గ‌ణేశ్ పెద్ద కుమారుడి ఫొటో వైరల్!

03-08-2021 Tue 12:37
  • ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసిన బండ్ల గ‌ణేశ్
  • అచ్చం బండ్ల గ‌ణేశ్ లానే ఉన్న‌ హితేశ్
  • సినిమాల్లోకి తీసుకొస్తారా? అంటున్న నెటిజ‌న్లు
bandla ganesh son pic go viral

సినీన‌టుడు, నిర్మాత‌ బండ్ల గ‌ణేశ్ పెద్ద‌ కుమారుడి ఫొటో వైరల్ అవుతోంది. తాజాగా, బండ్ల గ‌ణేశ్ ఓ ఫొటో పోస్ట్ చేసి 'నా పెద్ద కుమారుడు హితేశ్ నాగ‌న్ బండ్ల' అని పేర్కొన్నారు. అచ్చం బండ్ల గ‌ణేశ్ లానే హితేశ్ ఉన్నాడు. దీంతో ఈ ఫొటో వైర‌ల్ అవుతోంది. బండ్ల గ‌ణేశ్ కుర్రాడిగా ఉన్న‌ప్పుడు దిగిన ఫొటోలాగే ఇది ఉంద‌ని నెటిజన్లు పేర్కొంటున్నారు.

తండ్రికి త‌గ్గ త‌నయుడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. హితేశ్ నాగ‌న్‌ను సినిమాల్లోకి తీసుకు రావాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారా? అంటూ కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు. కాగా, న‌టుడిగా సినీరంగంలోకి ప్రవేశించి నిర్మాత‌గా కొన‌సాగుతోన్న బండ్ల గ‌ణేశ్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు పెద్ద ఫ్యాన్ అన్న విష‌యం తెలిసిందే. ప‌వ‌న్ తో ఇప్ప‌టికే ప‌లు సినిమాలు తీసిన ఆయ‌న ఇప్పుడు మ‌రో సినిమా తీయాల‌ని ఎదురు చూస్తున్నారు.