డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న 'తెలిసిన వాళ్లు'

03-08-2021 Tue 12:19
  • జంటగా రామ్ కార్తీక్, హెబ్బా పటేల్   
  • విప్లవ్ కోనేటి దర్శకత్వం 
  • 90 శాతం చిత్రీకరణ పూర్తి 
  • ఫస్టులుక్ పోస్టర్ రిలీజ్ 
Telisinavallu new movie update

ఈ మధ్య కాలంలో తెలుగు తెరకి కొత్త హీరోలు .. కొత్త దర్శకులు చాలామందే పరిచయమవుతున్నారు. ఎవరికి వారు కొత్త కాన్సెప్ట్ లతో ప్రేక్షకులను మెప్పించడానికి తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. టైటిల్ పోస్టర్ నుంచి ప్రతి విషయంలోను క్రియేటివిటీని చాటుతూ తమ సినిమాపై దృష్టి పడేలా చేస్తున్నారు. ఈ సినిమాల్లో ఎక్కువ భాగం యూత్ ను దృష్టిలో పెట్టుకునే వస్తున్నాయి.

అలా రూపొందిన సినిమానే 'తెలిసిన వాళ్లు'. రామ్ కార్తీక్ హీరోగా దర్శకుడు విప్లవ్ కోనేటి 'తెలిసినవాళ్లు' అనే టైటిల్ తో ఒక సినిమాను రూపొందించాడు. తాజాగా ఈ సినిమా నుంచి రామ్ కార్తీక్ ఫస్టులుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. సిరెంజ్ సినిమా బ్యానర్లో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా 90 శాతం వరకూ చిత్రీకరణను పూర్తిచేసుకుంది.

ఈ నెలలో మిగతా చిత్రీకరణను పూర్తిచేసి, సాధ్యమైనంత త్వరగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమాలో కథానాయికగా హెబ్బా పటేల్ అలరించనుంది. కెరియర్ ఆరంభంలో యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకున్న హెబ్బా పటేల్, ఆ తరువాత ఆ క్రేజ్ ను నిలబెట్టుకోలేకపోయింది. పరాజయాల కారణంగా ఆమెకి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆమె చేస్తున్న ఈ సినిమా, ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి.