పవన్ కథ కోసమే బండ్ల అన్వేషణ!

03-08-2021 Tue 11:44
  • పవన్ తో సాన్నిహిత్యం
  • గతంలో హిట్ కొట్టిన 'గబ్బర్ సింగ్'
  • మరో ప్రాజెక్టుకి సన్నాహాలు
  • కథలు వింటున్న గణేశ్  
Bandla Ganesh listening movie stories for Pavan kalyan

పవన్ కల్యాణ్ తో 'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ సినిమాను బండ్ల గణేశ్ నిర్మించాడు. ఆ తరువాత పవన్ చాలా సినిమాలు చేసినప్పటికీ, 'గబ్బర్ సింగ్' మాత్రం ఆయన కెరియర్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. అప్పటి నుంచి పవన్ - గణేశ్ ల మధ్య సాన్నిహిత్యం పెరుగుతూ వచ్చింది. పవన్ తో మరో హిట్ మూవీ చేయాలనే గణేశ్ కోరిక అలాగే ఉండిపోయింది.

రాజకీయాలలోకి వెళ్లిన పవన్ కొంత గ్యాప్ తరువాత, 'వకీల్ సాబ్'తో రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత నుంచి ఆయన వరుస సినిమాలను ఒప్పుకుంటూ వెళుతున్నారు. అలా ఇప్పుడు ఆయన చేతిలో మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయనతో మరో సినిమా చేయడానికి బండ్ల గణేశ్ రంగంలోకి దిగాడు.

డేట్స్ ఇవ్వడానికి పవన్ ఒప్పుడుకోవడంతో మంచి కథ కోసం గణేశ్ సెర్చ్ చేస్తున్నాడట. కొత్తగా అనిపించే పవర్ఫుల్ స్టోరీలు రెడీ చేయమని సీనియర్ దర్శకులకు చెప్పాడట. అలాగే కొత్త దర్శకులు తెచ్చే కథలను కూడా వింటున్నాడట. కథ తనకి నచ్చితే పవన్ దగ్గరికి ఆ దర్శకుడిని తీసుకువెళ్లే దిశగా గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడని అంటున్నారు. మరి ఏ డైరెక్టర్ ఆయనను ఒప్పిస్తాడో చూడాలి.