COVAXIN: కరోనా డెల్టా ప్లస్ వేరియంట్‌ను సమర్థంగా అడ్డుకుంటున్న కొవాగ్జిన్ టీకా

Covaxin effective against Delta Plus variant
షార్ట్స్‌లో చూడండి
కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు భారత బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా ప్రమాదకర డెల్టా ప్లస్ వేరియంట్‌పైనా ప్రభావం చూపుతున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. డెల్టా, డెల్టా ఏవై-1, బి.1.617.3 రకం వైరస్‌లపై కొవాగ్జిన్‌ను పరీక్షించినప్పుడు సానుకూల ఫలితాలు వచ్చినట్టు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది.

ఈ అధ్యయన ఫలితాల ఆధారంగా ‘బయోరిగ్జివ్’ సైన్స్ వెబ్‌సెట్‌ ఓ వ్యాసాన్ని ప్రచురించింది. దేశంలో రెండో దశ ఉద్ధృతికి డెల్టా వేరియంటే కారణమని ఇప్పటికే తేలింది. ఆ తర్వాత అది మళ్లీ రూపాంతరం చెంది డెల్టా ప్లస్‌గా మారింది. ఈ వేరియంట్‌పై కొవాగ్జిన్ సమర్థంగా పనిచేస్తున్నట్టు ఐసీఎంఆర్ తెలిపింది.

Go Back to Shorts
COVAXIN
Delta Plus
ICMR
Corona Virus

More Telugu News