Hair Salon: జీహెచ్ఎంసీ పరిధిలో హెయిర్ సెలూన్లు, లాండ్రీ షాపులకు ఉచిత విద్యుత్.. దరఖాస్తు చేసుకోవాలన్న తెలంగాణ ప్రభుత్వం

  • సెలూన్, లాండ్రీ షాపులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
  • ఇప్పటి వరకు చాలా తక్కువమంది దరఖాస్తు చేసుకున్నారన్న సోమేశ్ కుమార్
  • మీ సేవ కేంద్రాల్లో ఉచిత నమోదు సౌకర్యం
Free Electricity to Hair Salons and Laundry Shops in Telangana

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు హెయిర్ సెలూన్లు, లాండ్రీ దుకాణాలకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ దుకాణాలకు ప్రభుత్వం 250 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్‌ను సరఫరా చేయనుంది. ఈ పథకాన్ని పొందేందుకు సెలూన్, లాండ్రీ దుకాణాల యజమానులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కోరారు.

ఇప్పటి వరకు అతి తక్కువమంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నట్టు ఆయన తెలిపారు. ఈ పథకానికి అర్హులైన ఆయా సామాజిక వర్గాల వారు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) పోర్టల్‌ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మీ సేవ కేంద్రాల్లోనూ ఉచిత నమోదు సౌకర్యం కల్పించామని, సద్వినియోగం చేసుకోవాలని సోమేశ్ కుమార్ కోరారు.

More Telugu News