సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

03-08-2021 Tue 07:27
  • తమిళ సినిమాకి ఓకే చెప్పిన సాయిపల్లవి 
  • నాగార్జున 'బంగార్రాజు' షూటింగుకి ఏర్పాట్లు
  • బన్నీతో యానిమేషన్ సినిమా తీయాలనుందట!
Sai Pallavi signs a Tamil film

*  తెలుగులో బిజీగా సినిమాలు చేస్తున్న కథానాయిక సాయిపల్లవి రెండేళ్ల గ్యాప్ తర్వాత తన మాతృభాష తమిళంలో ఓ సినిమా చేయనుంది. డ్రీమ్ వారియర్ సంస్థ నిర్మించే ఈ చిత్రానికి గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహిస్తాడు. ఇది కథానాయిక ప్రధాన చిత్రంగా తెరకెక్కుతుంది.
*  అక్కినేని నాగార్జున హీరోగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందే 'బంగార్రాజు' చిత్రం షూటింగు ఈ నెల 20 నుంచి హైదరాబాదులో జరుగుతుంది. నవంబర్ నెలతో మొత్తం షూటింగ్ పూర్తయ్యేలా షెడ్యూల్స్ వేశారు. సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేస్తారు.  
*  స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ తో ఒక యానిమేషన్ ఫిలిం రూపొందించాలని ఉందంటున్నారు దర్శకుడు మారుతి. 'బన్నీకి యానిమేషన్స్ అంటే చాలా ఇష్టం. తాను బొమ్మలు కూడా బాగా వేస్తాడు. హాలీవుడ్ యానిమేషన్ చిత్రం 'అల్లాడిన్' వంటి చిత్రాన్ని ఆయనతో తీయాలని వుంది' అని చెప్పాడు మారుతి. మరి, ఈయన కోరిక ఎప్పటికి తీరుతుందో!