చైనా వర్సిటీలో బీహార్ విద్యార్థి మృతి

02-08-2021 Mon 21:47
  • తియాన్జిన్ వర్సిటీలో చదువుతున్న అమన్ 
  • అమన్ స్వస్థలం బీహార్ లోని గయ
  • గత నెల 29న మృతి
  • గదిలో విగతజీవుడిలా అమన్
  • పోలీసుల దర్యాప్తు
Indian student died in China versity

చైనాలోని తియాన్జిన్ ఫారెన్ స్టడీస్ యూనివర్సిటీలో ఓ భారత విద్యార్థి మృతి చెందాడు. ఆ విద్యార్థి పేరు అమన్ నాగ్ సేన్. బీహార్ లోని గయకు చెందిన అమన్ తియాన్జిన్ వర్సిటీలో బిజినెస్ కోర్సు అభ్యసిస్తున్నాడు. అయితే గత నెల 29న తన గదిలో విగతజీవుడిలా పడివుండడాన్ని గుర్తించారు. అతడి మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు విచారణ జరుపుతున్నారు.

దీనిపై బీజింగ్ లోని భారత దౌత్య వర్గాలు స్పందించాయి. అమన్ మృతదేహాన్ని భారత్ పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించాయి. అతడి కుటుంబంతో మాట్లాడుతున్నామని అధికారులు తెలిపారు. అమన్ కరోనా సంక్షోభం నేపథ్యంలో చైనాలో ఉండిపోయినట్టు తెలిసింది.