పవన్, రానా చిత్రం రిలీజ్ డేట్ ఖరారు

02-08-2021 Mon 21:35
  • అయ్యప్పనుమ్ కోషియమ్ చిత్రానికి తెలుగులో రీమేక్
  • మలయాళంలో హిట్టయిన చిత్రం
  • తెలుగులో  ప్రధానపాత్రల్లో పవన్, రానా
  • సాగర్ కె చంద్ర దర్శకత్వం
  • వచ్చే ఏడాది జనవరి 12న రిలీజ్!
Pawan and Rana starring remake release date confirmed

మలయాళంలో హిట్టయిన అయ్యప్పనుమ్ కోషియమ్ చిత్రాన్ని పవన్ కల్యాణ్, రానా హీరోలుగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సాగర్ కె చంద్ర దర్శకుడు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ఖరారు చేసినట్టు తెలిసింది. వచ్చే సంక్రాంతి బరిలో పవన్, రానా చిత్రాన్ని తీసుకురావడానికి చిత్రబృందం సన్నద్ధమవుతోంది. 2022 జనవరి 12న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారని ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ పేర్కొన్నారు.

కాగా ఈ చిత్రానికి ఇంకా పేరు పెట్టలేదు. త్వరలోనే ఈ సినిమా నుంచి ఓ పాటను రిలీజ్ చేసేందుకు ప్రస్తుతం సన్నాహాలు జరుగుతున్నాయి. మ్యూజిక్ సిట్టింగ్స్ లో పవన్ కల్యాణ్, ఈ సినిమాకు మాటలు రాస్తున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తదితరులున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.