'విజయ రాఘవన్' నుంచి ట్రైలర్ రిలీజ్!

02-08-2021 Mon 19:27
  • విజయ్ ఆంటోనికి మంచి క్రేజ్
  • 'బిచ్చగాడు' తరువాత దక్కని హిట్
  • మరో కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు
  • సెట్ కాని డబ్బింగ్ వాయిస్
Vijay Raghavan trailer released

విజయ్ ఆంటోని పేరు వినగానే అందరికీ గుర్తుకు వచ్చే సినిమా 'బిచ్చగాడు'. ఈ సినిమాతో ఆయనకి విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆ తరువాత ఆయన నుంచి విభిన్నమైన సినిమాలు వచ్చాయి. విలక్షణమైన పాత్రలతో మెప్పించడానికి ఆయన తన వంతు ప్రయత్నం చేశాడు. కానీ 'బిచ్చగాడు' స్థాయిలో అవి ప్రేక్షకుల ఆదరణను పొందలేకపోయాయి.

ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకులను పలకరించడానికి 'విజయ రాఘవన్' సినిమా సిద్ధమవుతోంది. ఆనంద్ కృష్ణన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, విజయ్ ఆంటోని సరసన నాయికగా 'ఆత్మిక' అలరించనుంది. ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో 'గరుడ' రామ్ నటించాడు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

రౌడీ గ్యాంగులు .. రాజకీయనాయకులు .. ఆధిపత్య పోరు .. మధ్యలో నలిగిపోయే సామాన్య ప్రజలు .. వాళ్లకి మంచి చేయబోయే ప్రయత్నంలో హీరో ఎదుర్కునే పరిణామాలే ఈ సినిమా కథ అనే విషయం ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది. కాకపోతే విజయ్ ఆంటోనికి డబ్బింగ్ వాయిస్ సెట్ కాలేదని అనిపిస్తోంది. రెగ్యులర్ గా విశాల్ కి చెప్పించే వారితో విజయ్ ఆంటోనికి చెప్పించారు గానీ నప్పలేదు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.