టోక్యో ఒలింపిక్స్ లో మహిళల డిస్కస్ త్రో ఫైనల్స్ లో భారత్ కు నిరాశ

02-08-2021 Mon 19:24
  • ఫైనల్లో విఫలమైన కమల్ ప్రీత్
  • ఆరోస్థానంలో నిలిచిన భారత అథ్లెట్
  • డిస్క్ ను 63.70 మీటర్లు విసిరిన వైనం
  • స్వర్ణం చేజిక్కించుకున్న అమెరికా అథ్లెట్ వలేరీ
Kamal Preet disappoints in discus throw finals

భారత్ కు టోక్యో ఒలింపిక్స్ లో మరో పతకం కొద్దిలో చేజారింది. ఇవాళ వర్షం నడుమ జరిగిన డిస్కస్ త్రో ఫైనల్లో భారత్ కు నిరాశ ఎదురైంది. డిస్కస్ త్రో ఫైనల్లో భారత అథ్లెట్ కమల్ ప్రీత్ కౌర్ ఆరోస్థానంలో నిలిచింది. ప్రిలిమినరీ రౌండ్లలో విశేష ప్రతిభ కనబర్చిన కమల్ ప్రీత్ ఫైనల్ కు దూసుకురావడం ద్వారా పతకంపై ఆశలు పెంచింది. అయితే, ఫైనల్లో డిస్క్ ను 63.90 విసిరినా ఫలితం దక్కలేదు. కమల్ ప్రీత్ కు ఇప్పటివరకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన.

కాగా, టోక్యో ఒలింపిక్స్ డిస్కస్ త్రో స్వర్ణాన్ని అమెరికాకు చెందిన వలేరీ ఆల్మన్ ఎగరేసుకెళ్లింది. వలేరీ డిస్క్ ను 68.9 మీటర్లు విసిరి ప్రథమస్థానంలో నిలిచింది. జర్మనీకి చెందిన క్రిస్టీన్ పుడెంజ్ (66.86మీ) రజతం, క్యూబా అథ్లెట్ యాయిమీ పెరెజ్ (65.72) కాంస్యం సాధించారు.