కొత్త రికార్డు క్రియేట్ చేసిన మహేశ్ మూవీ పోస్టర్!

02-08-2021 Mon 18:48
  • సెట్స్ పై 'సర్కారువారి పాట' 
  • స్కామ్ చుట్టూ తిరిగే కథ 
  • పోస్టర్ కి మంచి రెస్పాన్స్ 
  • ఈ నెల 9న టీజర్ రిలీజ్
Sarkaru Vaari Paata movie update

మహేశ్ బాబు - పరశురామ్ కాంబినేషన్లో 'సర్కారువారి పాట' రూపొందుతోంది. బ్యాంకు స్కామ్ నేపథ్యంలో ఈ సినిమా నిర్మితమవుతోంది. కరోనా కారణంగా ఆగిపోయిన షూటింగు, ఇటీవలే మళ్లీ మొదలైంది. ప్రస్తుతం ప్రధాన పాత్రల కాంబినేషన్లో ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

జులై 31వ తేదీన ఈ సినిమా నుంచి ఫస్టు నోటీస్ అంటూ మహేశ్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇది ఈ సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్ కి సంబంధించిన స్టిల్ అనే విషయం అర్థమవుతుంది. బైక్స్ పై కొందరు ఛేజ్ చేస్తున్నట్టుగా కనిపించడం .. మహేశ్ కారు అద్దం పగిలి ఉండటాన్ని బట్టి ఆయన యాక్షన్ లో ఉన్నాడనే విషయం స్పష్టమవుతోంది.

ఈ పోస్టర్ లో మహేశ్ హెయిర్ స్టైల్ చాలా కొత్తగా కనిపిస్తోంది. ఆయన లుక్ ఆకట్టుకునేలా ఉంది. 24 గంటల్లోనే 95.6K లైక్స్ ను, 49.1K రీ ట్వీట్ లను సాధించిన ఈ పోస్టర్, సరికొత్త రికార్డులను సృష్టించింది. అత్యంత వేగంగా 100K లైక్స్ ను సాధించిన పోస్టర్ గా కూడా కొత్త రికార్డును నమోదు చేసింది. ఇక మహేశ్ బాబు బర్త్ డే సందర్భంగా ఈ నెల 9వ తేదీన ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది.