'సలార్'లో కత్రినా స్పెషల్ సాంగ్!

02-08-2021 Mon 18:14
  • షూటింగు దశలో 'సలార్'
  • శ్రుతి హాసన్ కి లక్కీ ఛాన్స్ 
  • మసాలా సాంగ్ పై దృష్టి 
  • తెరపైకి కత్రినా పేరు
Salaar movie update

ప్రభాస్ తన కెరియర్ ను మొదలుపెట్టిన దగ్గర నుంచి చాలా కూల్ గా ఒక సినిమా తరువాత మరో సినిమా చేస్తూ వచ్చాడు. అలాంటి ప్రభాస్ ఇప్పుడు వరుసగా పాన్ ఇండియా సినిమాలు ఒప్పేసుకుని, ఒక సినిమా షూటింగు నుంచి మరో సినిమా షూటింగుకు షిఫ్ట్ అవుతూ బిజీబిజీగా ఉన్నాడు. ఆయన పాన్ ఇండియా సినిమా 'రాధే శ్యామ్' విడుదల దిశగా సన్నాహాలు చేసుకుంటోంది.

ప్రస్తుతం ప్రభాస్ .. 'సలార్' సినిమా షూటింగులో బిజీగా ఉన్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఊహించిన దానికంటే ఎక్కువ వేగంగానే షూటింగు జరుపుకుంటోంది. ఈ సినిమాలో మాస్ ఆడియన్స్ ను ఊపేసే ఒక మసాలా సాంగ్ ఉందట. ఈ పాట కోసం కత్రినాను సంప్రదించడం .. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయని అంటున్నారు. ఇందుకోసం ఆమెకి భారీ మొత్తమే ముట్టనుందని అంటున్నారు.
   
ఇక ఈ సినిమాలో ప్రభాస్ జోడీగా శ్రుతి హాసన్ అలరించనుంది. శ్రుతి హాసన్ కెరియర్ మసకబారుతోందని అంతా అనుకుంటున్న వేళ ఆమెకి దక్కిన భారీ అవకాశం ఇది. ఈ సినిమా హిట్ అయితే ఆమె అంతకుముందులా తన జోరును చూపించే అవకాశాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు.