ఢిల్లీలో స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ ధర్నాలో పాల్గొన్న టీడీపీ ఎంపీలు

02-08-2021 Mon 18:01
  • వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం నిర్ణయం
  • ఢిల్లీలో ఆందోళన చేపట్టిన పోరాట కమిటీ
  • మద్దతు ఇస్తున్న ఏపీ ఎంపీలు
  • ఐక్యంగా పోరాడదామన్న టీడీపీ ఎంపీలు
TDP MPs supports for Visakha Steel Plant agitaion

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటం తీవ్రరూపు దాల్చుతోంది. ఉక్కు పరిశ్రమ పోరాట కమిటీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా జరుపుతుండగా, ఏపీ ఎంపీలు మద్దతుగా తాము కూడా ధర్నాలో పాల్గొంటున్నారు. వైసీపీ ఎంపీలు ఇప్పటికే పోరాట కమిటీకి మద్దతు ప్రకటించారు.

తాజాగా, టీడీపీ ఎంపీలు కూడా జంతర్ మంతర్ వద్దకు వెళ్లి ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్రకుమార్ విశాఖ ఉక్కు పోరాట కమిటీకి సంఘీభావం తెలిపారు. ఐక్యంగా పోరాడి విశాఖ ఉక్కును కాపాడుకుందామని పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు పార్లమెంటులోనూ, బయటా పోరాడతామని స్పష్టం చేశారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.