'సాహో' దర్శకుడితో చరణ్!

02-08-2021 Mon 17:41
  • సుజీత్ వినిపించిన కథ
  • చరణ్ నుంచి గ్రీన్ సిగ్నల్ 
  • శంకర్ సినిమా తరువాత సెట్స్ పైకి 
  • అధికారికంగా రావలసిన స్పష్టత  
Charan in Sujeeth movie

చరణ్ ఓ యువ దర్శకుడితో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తోంది. ఆ యువ దర్శకుడి పేరే సుజీత్. అతని పేరు వినగానే ఎవరికైనా 'సాహో' సినిమా గుర్తుకు వస్తుంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమా, వివిధ భాషల్లో విడుదలైంది. అప్పట్లో అంతా ఈ సినిమాను గురించే మాట్లాడుకున్నారు.

భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా పరాజయం పాలైంది. ప్రభాస్ అభిమానులను పూర్తిస్థాయిలో నిరాశ పరిచింది. దాంతో అప్పటి నుంచి సుజీత్ మరో సినిమా చేయలేకపోయాడు. 'లూసిఫర్' రీమేక్ బాధ్యతలను సుజీత్ కి అప్పగించే ప్రయత్నాలు జరిగాయి. కానీ చివరి నిమిషంలో చరణ్ మనసు మార్చుకున్నాడు.

అయితే ఓ మంచి కథను తయారు చేసుకుని వస్తే తాను చేస్తానని ఆ సమయంలో సుజీత్ కి చరణ్ మాట ఇచ్చాడట. రీసెంట్ గా సుజీత్ కథ వినిపించడం .. చరణ్ ఓకే చెప్పడం జరిగిపోయిందని అంటున్నారు. శంకర్ సినిమాను పూర్తిచేసిన తరువాత ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని అంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి.